calender_icon.png 4 November, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సాంబశివ దేవాలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు..

04-11-2025 05:46:54 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): కార్తీకమాస వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో శివుడికి ఘనంగా అభిషేకలు చేయడం జరిగింది. అనంతరం గోమాత పూజలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. గోమాతకు శాలువాతో సన్మానించి.. ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ, సాయి ప్రణవ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున అభిషేకం గోపూజలో పాల్గొన్నారు. భక్తులు దీప దానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పారువెల్ల రమేష్ శర్మ అసిస్టెంట్ బండి రామ్మోహన్ తో పాటు భక్త బృందం పాల్గొన్నారు. అలాగే సాంబశివ దేవాలయం నుండి జరిగిన నగర సంకీర్తనలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి శివాలయంలో శివుడికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి పొలాస అశోక్, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.