04-11-2025 05:43:08 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీఐ వేధింపులు తాళలేక కిందిస్థాయి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం పట్టణంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ అఖిలను సీఐ జయశ్రీ వేధింపులకు గురి చేస్తుందని, వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించడంలో ప్రాణాపాయ పరిస్థితి తప్పింది. అనంతరం ఆమె కుటుంబీకులతో సీఐ తనను అంటరానివారిగా చూస్తున్నారని, తనతో మాట్లాడిన, తాను ఎవరితోనైనా మాట్లాడిన బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఆమె కుటుంబీకులు ధర్న నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.