calender_icon.png 4 November, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

04-11-2025 05:53:01 PM

చిన్న బోనాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ, అధికారులకు సూచనలు..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి మంగళవారం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఆ విద్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ డెస్క్ లు, సర్టిఫికెట్ల పరిశీలనను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కో ఆర్డినేటర్ జేజే థెరిసా తదితరులు పాల్గొన్నారు.