04-11-2025 05:41:37 PM
ఎంపిఓ సత్యనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను ప్లాస్టిక్ రహిత గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దారని మండల పంచాయతీ అధికారి ఎం సత్యనారాయణ కోరారు. మంగళవారం మండలంలోని మామిడిగట్టు గ్రామపంచాయతీని సందర్శించి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి, ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే సమయంలో గ్రామపంచాయతి ట్రాక్టర్లలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి, కంపోస్టు షెడ్ నందు వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇంటి పన్ను వసూలును వేగవంతం చేసి ఈనెల 15 వరకు అన్ని గ్రామ పంచాయతీలలో 100 శాతం పూర్తి చేయాలన్నారు. అన్ని రకాల రిజిష్టర్లు నిర్వహిస్తూ, వాటిని అప్డేట్ చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ట్రేడ్ లైసెన్స్ లను వెంటనే రెన్యువల్ చేయించాలని, ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వాలని, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్సియల్ ఆడిట్ పేరాలను డ్రాప్ చేయించుకోవాలని సూచించారు. పంచాయతి కార్యదర్శులు ప్రతీ రోజు ఉదయం విధులకు హాజరై 9:00 గం,, లోపు పిఎస్ యాప్ లో హాజరు, డిఎస్ఆర్ నమోదు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్లకు వెంటనే ఇన్సూరెన్స్ పాలసీలు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో పంచాయతీ కార్యదర్శి పి సంధ్యారాణి సిబ్బంది పాల్గొన్నారు.