16 April, 2026 | 11:05 AM

రామప్పను సందర్శించిన విదేశీయులు

04-11-2025 12:00 AM

వెంకటాపూర్(రామప్ప), నవంబర్ 3(విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని సోమవారం జపాన్ దేశానికి చెందిన మాకోతో, రోమనియా దేశానికి చెందిన బేట్రిస్ భజేనర్ లు సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయంలో పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర శిళ్పకళ ప్రాముఖ్యత ను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువు, ప్రకృతి అందాలను సందర్శించారు.