ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి రైతు తప్పనిసరిగా తీసుకోగలరు
12-01-2026 07:45 PM
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం కోసం అందించే పథకాలు లబ్ధి పొందాలంటే రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాబట్టి మీకు సమీపంలో గల మీసేవ కేంద్రంలో గాని వ్యవసాయ విస్తరణ అధికారి గాని సంప్రదించి రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
ఇందుకోసం కోసం కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్ పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ తో సంప్రదించగలరు. రైతు రిజిస్ట్రేషన్ ఈరోజు ముప్పనపల్లిలో చేయడం జరిగింది. కార్యక్రమం నేడు లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.




