12-01-2026 07:43:34 PM
మున్సిపల్ కమిషనర్ టి.రమేష్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ టి. రమేష్ ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఓటర్ లిస్ట్ ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ... ప్రభుత్వం ఓటర్ దరఖాస్తులు కు ఇచ్చిన గడువు లోపల 35 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 14 దరఖాస్తులను ఓటర్ల వారి వారి వార్డులలో చేర్చడం జరిగిందని మరో 21 దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయని తెలిపారు.
15 వార్డులలో 16824 ఓటర్లు ఉన్నారని అతి స్వల్పంగా 5 వ వార్డులో 1003 ఓటర్లు ఉన్నారని అత్యధికంగా 12 వ వార్డులో 12 29 ఓటర్లు నమోదై ఉన్నారని 13 వార్డులలో దాదాపు 1000 నుండి 1100 ఓటర్లు ఉన్నారని తెలిపారు. 16 వ తేదీన పోలింగ్ స్టేషన్ ల వారిగా ప్రకటిస్తామని అన్నారు. అన్ని వార్డులకు సంబంధించి ఓటర్లు తమ ఓట్లు వినియోగించుకునేలా సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, ఏఈ రాజ్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.