11 July, 2026 | 1:55 AM

అనురాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్

11-07-2026 12:52 AM

ఘట్ కేసర్, జూలై 10 (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న రాచమల్ల సాయి కిరణ్ తన పీహెచ్డీ థీసిస్ను విజయవంతంగా డిఫెండ్ చేసి మరో విశిష్టమైన విద్యా మైలురాయిని చేరుకున్నారు.

డాక్టర్ జోషి శ్రీనివాస ప్రసాద్ మార్గదర్శకత్వంలో ఆయన ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆన్ ఎన్ ఆన్స్ మెంట్ ఆఫ్ వాటర్ రెసిస్టెన్స్ ఆఫ్ అనే అంశంపై పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో హైడ్రోఫోబిక్ పదార్థాల వినియోగం ద్వారా మెగ్నీషియం ఆక్సీక్లోరైడ్ సిమెంట్ మోర్టార్ నీటి నిరోధకత, మన్నికను పెంచే అంశాలను ప్రయోగాత్మకంగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన నిర్మాణ రంగంలో పర్యావరణహిత, మన్నికైన అధిక నాణ్యత కలిగిన నిర్మాణ పదార్థాల అభివృద్ధికి దోహదపడనుంది.

ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ సీఈఓ, వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ అర్చనా మంత్రీ, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్, రిసెర్చ్ డీన్ ప్రొఫెసర్ సతీష్ కోమరన్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎం.డి. సికిందర్ బాబా, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పల్లవి బద్రి, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, సహచరులు సిబ్బంది రాచమల్ల సాయి కిరణ్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.