24 August, 2026 | 11:29 AM

Breaking News

ఎస్‌ఐఆర్‌లో ప్రతి ఓటరు స్వచ్ఛందంగా పాల్గొనాలి

08-07-2026 12:00 AM

బీఎల్‌ఓ, బీఎల్‌ఏలకు సహకరించాలి ః ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

కుత్బుల్లాపూర్, జూలై 7 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిషన్ లో ప్రతి ఓటర్ స్వచ్ఛందంగా పాల్గొని బిఎల్‌ఓ, బిఎల్‌ఏ లకు సహకరించాలని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిషన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమ అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం 285 - పద్మా నగర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ 2 లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమానికి బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, అధికారులు, బిఎల్‌ఓ, బిఎల్‌ఏ, స్థానిక పౌరులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ అనే కార్యక్రమం ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే కార్యక్రమమని, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో  దేశంలోని అన్ని రాష్ట్రాలలో విడుదలవారీగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలని, ముఖ్యంగా బిఎల్‌ఓ, బిఎల్‌ఏ లు సమగ్ర అవగాహన పెంపొందించుకొని ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు జరగకుండా ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో 2002 సంవత్సర జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు కనుక 2002 సంవత్సరంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, మీ ఓటు హక్కు ఎక్కడ ఉంది అనేది పూర్తి వివరాలు బిఎల్‌ఓ, బిఎల్‌ఏ లకు తెలియజేయడం ద్వారా సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనలో అధికారులతో పాటు  ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఏ, బిఎల్‌ఓలు, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.