8 July, 2026 | 1:59 AM

ప్రశాంతంగా ‘రైల్వే’ ఎన్నికలు

08-07-2026 12:00 AM

ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయ్స్ అసోసియేషన్ జోనల్ 

ఎగ్జిక్యూటివ్ కమిటీ, (ఎస్సీఆర్ జోన్)జోనల్ ప్రెసిడెంట్‌గా వై.లక్ష్మీపతి

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయ్స్ అసోసియేషన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, (ఎస్సీఆర్ జోన్) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 6న జరిగిన జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలలో  నిర్వహించినట్లు ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయ్స్ అసోసియేషన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, (ఎస్సీఆర్ జోన్) విజయం సాధించారు.

ఎన్నికైన నూతన జోనల్ కమిటీ వివరాలు జోనల్ ప్రెసిడెంట్గా వై. లక్ష్మీపతి, జోనల్ సెక్రటరీగా పి. గోపాలకృష్ణ,జోనల్ అడిషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం. భద్రియా,జోనల్ అడిషనల్ సెక్రటరీగా కె.నాగేశ్వరరావు,జోనల్ ట్రెజరర్గా బి. శ్యామ్రావు కమిటీతో పాటు ఇతర పదవులకు ఎన్నికైన అభ్యర్థులఎన్నికైనట్టు ఎన్నికల అధికారి వెల్లడించారు.

ఈ విషయం పట్ల ఎన్నికైన అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయ్స్ అసోసియేషన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎంప్లాయిస్ కి మరింత సేవ చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సభ్యులను పూలదండలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.