8 July, 2026 | 2:00 AM

ఓయూలో ఓజస్-2౦26 ప్రారంభం

08-07-2026 12:00 AM

ప్రారంభించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద్ రెడ్డి, ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆరట్స్ కళాశాలలో నిర్వ హిస్తున్న సాహిత్య, సాంస్కృతిక, అకాడమిక్ ఉత్స వం ‘ఓజస్2కె26’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి.ముకుంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలా నుగుణంగా విద్యార్థులు తమను తాము మార్చుకుంటూ కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలని సూచించారు.

ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ వ్యక్తిగత క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, నైపుణ్యాల ద్వా రానే విద్యా ర్థులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యా ర్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే వేదికగా ఓజస్ 2కే26నిలుస్తుందని చెప్పారు.  ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆరట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీం మాట్లాడుతూ ఆరట్స్ కళాశాల ఉద్యమాలకు మాత్రమే కాకుండా అకాడమిక్ ప్రతిభకు కూడా చిరునామా అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆరట్స్ కళా శాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీం, ఎన్టీవీ సీఈవో రాజశేఖర్ రెడ్డి, స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కరస్పాండెంట్ కె. కృష్ణారావు, ఓయూ పాలక మండలి సభ్యుడు బి.మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.