15 May, 2026 | 2:52 AM

‘మీసేవ’ ద్వారా డీఈఈసెట్ హాల్ టికెట్లు

15-05-2026 12:00 AM

నేటి నుంచి మీ సేవ, వాట్సాప్‌తో అందుబాటులోకి..

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు శుక్రవారం ఉదయం 10  గంటల నుంచి వాట్సాప్ ద్వారా తమ హాల్ టికెట్లను పొందవచ్చు. డీఈఈసెట్ పరీక్ష ఈ నెల 21,22 తేదీల్లో జరగనుంది.

రాష్ట్ర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకంగా, సులభమైన డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో మీ సేవ ద్వారా పౌర సేవలను మరింతగా విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిజిటల్ సేవల వేదిక అయిన మీ సేవ, 18 నవంబర్ 2025న ప్రారంభించిన మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవల ద్వారా ప్రజలకు మరింత సులభంగా ప్రభుత్వ సేవలను అందిస్తోంది.

ఈ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ వేదిక తెలంగాణలో అత్యంత వేగంగా ప్రజాదరణ పొందిన డిజిటల్ పౌర సేవా వేదికలలో ఒకటిగా నిలిచింది. వాట్సాప్ ఆధారిత ప్రభుత్వ సేవలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, మీ సేవ వేదికల ద్వారా మరిన్ని డిజిటల్ సేవలను విస్తరించేందుకు నిరంతర ప్రయత్నం చేస్తోంది. 

మీ సేవ వాట్సాప్ ద్వారా డీఈఈసెట్ హాల్ టికెట్ పొందే విధానం 

అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096ను మీ సేవా తెలంగాణ పేరుతో సేవ్ చేసుకోవాలి, వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పంపా లి, డీఈఈసెట్ హాల్ టికెట్ అ ని టైప్ చేయాలి, మెనూలో క నిపించే ఓపెన్ సర్వీస్ ఎంపిక పై క్లిక్ చేయాలి, అవసరమైన వివరాలు నమోదుచేయాలి, పే మెంట్, అప్లికేషన్ నెంబర్, మొ బైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్  స మర్పించనే డీఈఈసె ట్ హాల్ టికెట్ వాట్సాప్‌లో అందుతుంది. ఈ సేవ ద్వారా  పరీక్షలకు సంబంధించిన సేవలు వేగం గా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి.కాగా అత్యధికంగా వినియోగిస్తున్న సేవలు: జనన,ఆదాయ ధృవపత్రాలు, పోలీస్ చలాన్, విద్యు త్ బిల్లు, బీఐఈ ఫలితాల సేవలు.