26 June, 2026 | 6:29 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బోరు బండి లారీ..

27-04-2026 12:48 AM

మెదక్/నర్సాపూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బోరు బండి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో  బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

జనం ఎక్కవగా ఉండే సమయంలో, రద్దీ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో  పెద్ద ప్రమాదమే తప్పింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గజ్వేల్ నుండి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులకు పది మంది వరకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని లారీని పిఎస్ కు తరలించారు.