8 July, 2026 | 2:02 AM

ప్రతిఒక్కరూ ఓటు హక్కును కాపాడుకోవాలి

08-07-2026 12:00 AM

మాగంటి సునీత గోపీనాథ్

జూబ్లీహిల్స్, జూలై 7(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ అన్నారు. పార్టీ ఆద్వర్యంలో మంగళవారం యూసుఫ్ గూడ డివిజనులో నిర్వహించిన ప్రతి ఇంటికి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఎస్‌ఐఆర్ పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని కోరారు. అవసరమైన సవరణలు చేయించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన పౌరులు నూతన ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని స్పష్టం చేశారు. ప్రతి ఓటరు న్యూమరేషన్ ఫారం నింపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.