సర్ ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్
నాగల్గిద్ద, జూలై 7: నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి నాగల్గిద్ద మండలం ఇరక్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్లు 76, 77, 78లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్ ) ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణను వేగవంతం చేయడంతో పాటు డిజిటలైజేషన్ను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఫారాన్ని నింపి సంబంధిత బీఎల్వోకు అందజేసి ఓటరు జాబితా సవరణకు సహకరించాలని సూచించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనం, పాఠశాల సౌకర్యాలు, బోధన విధానంపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంగ్రాం రెడ్డి, డిప్యూటీ ఎమ్మా ర్వో శివకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి సూపర్వైజర్ ఇంద్ర కుమార్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






