25 August, 2026 | 3:17 AM

పచ్చదనంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

25-08-2026 01:50 AM

మొక్కలు నాటిన సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి

కౌకుంట్ల ఆగస్టు 24: పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటికి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పేరు గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ గ్రామం లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దేవాలయం సమీపంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె సూచించారు.ప్రతి ఇంటికి ఒక్క మొక్క సంకల్పంతో గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక మొక్కను అందజేశారు.

మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. మన ఇంటి ముందు ఒక మొక్క.. మన గ్రామానికి పచ్చని భవిష్యత్తు అనే సందేశంతో గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండారి గొల్ల రాములు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.