కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి
శంకర్‌పల్లి, మార్చి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలం లోని టంగటూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బద్దం మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అనిల్ , మైనార్టీ సెల్ అధ్యక్షుడు అజ్మత్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్ ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు.మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం తో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామ సర్పంచ్ బద్దం హరిత కృష్ణా రెడ్డి, ఉప సర్పంచ్ అంతయ్య, మాజీ సర్పంచ్ నర్సింహ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదిరెడ్డి,వార్డు సభ్యులు పాదురంగ రెడ్డి, రంగారెడ్డి, జంగయ్య, మల్లేశం, నాయకులు రమేష్ అప్పా, మాణిక్య రెడ్డి, రాఘవేందర్,రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




