అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
సీఐటీయూ నాయకులు మొగుదాల వెంకటేశం
చండూరు, మార్చి 20 : అక్రమ అరెస్టులతో ఆశ వర్కర్ల ఉద్యమాలను ఆపలేరని సిఐటియు సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం అన్నారు. శుక్రవారం స్థానిక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరుతున్న సిఐటియు సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశమును, చిట్టి మల్ల లింగయ్యను ముందస్తుగా చండూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలు న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంటే పోలీసులు ఆశాలను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఆశా వర్కర్లకు కనీసం రూ.18వేల వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి, పర్మినెంట్ ఉద్యోగులకు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రయోజనాలను ఆశ వర్కర్లకు కూడా వర్తింపజేయాలన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు.




