calender_icon.png 4 May, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పై ఉక్కుపాదం

02-05-2025 12:00:00 AM

నెల వ్యవధిలో 34 కేసులు నమోదు

56 మంది అరెస్ట్

నిందితులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మే 1 (విజయక్రాంతి): జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేవరకు జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలను తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. తెలిపారు. జిల్లా లో గంజాయి దందా పై ఉక్కు పాదం మోపి గంజాయి అమ్మకాలు, పండించే వారిని, వినియోగదారులను అణచివేస్తామని స్ప ష్టం చేశారు. గత నెల 10వ తేదీ నుండి ఇప్ప టి వరకు జిల్లాలో 34 గంజాయి కేసులు నమోదయ్యాయని, అందులో 56 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కటకటాలకు తరలించడం జరిగిందన్నారు. ఇప్ప టి వరకు నమోదైన కేసులలో 12 కిలోల ఎం డిన గంజాయి, 181 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ 23, 21,550/- ఉంటుందని తెలిపారు.

అందరి సమిష్టి కృషితో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయిని జిల్లాలో కనబడకుండా చేస్తాం అన్నా రు. ఇప్పటివరకు జిల్లా  నందు గంజాయి సాగు చేస్తూ నమోదైన నాలుగు కేసులలో నిందితులకు ప్రభుత్వ పథకాలు రాకుండా చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ADB-- (ఆదిలాబాద్ నార్కోటిక్ బ్యూరో) మొదలై చురుకుగా విధులు నిర్వర్తిస్తుందని, గంజాయిని పండిం చే వారిని వర్తకులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా గంజాయిపై మాదక ద్రవ్యాలపై ఎలాంటి సమాచారం అయినా 8712659973 నంబ ర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.