19-05-2025 12:37:33 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, మే 18 : ప్రతి ఒక్కరు భక్తిభావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కడ్తాల్ మండలం న్యమతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు అయన ముఖ్య అతిథులుగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, పడి పంటలు బాగుగుండాలని అమ్మవారికి పూజలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, కిషన్ సెల్ మండల అధ్యక్షుడు అర్కోటం బాల్ రాజ్, నాయకులు శ్రీనివాస్, వెంకటేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.