calender_icon.png 19 May, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూడూరులో ఘనంగా శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ బోనాల ఉత్సవాలు

19-05-2025 12:35:31 AM

మేడ్చల్, మే 18(విజయ క్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పరిధి పూడూరు గ్రామంలో మూడు సంవత్సరాలకు ఒక్కసారి వైభవంగా నిర్వహించే శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగాఆలయ పూజారి పాలకుర్తి శివప్ర సాద్ అమ్మవార్లను నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించారు.ఆనవాయితీ ప్రకారం గ్రా మంలోని వైశ్యులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు.

మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంభం వెంకట్ రాజ్ తనయుడు కంభం అంజన్ రాజ్  అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని మహిళలు,భక్తులు పెద్ద ఎత్తున  శ్రీ శివ్వంపే ట పోచమ్మ- మైసమ్మ దుర్గమ్మ,ముత్యాలమ్మలకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.భక్తుల కోలాహాలంతో ఆలయ పరిసరాలల్లో సందడి నెలకొంది.