calender_icon.png 19 May, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయం ఉపాధిలో రాణించాలి

19-05-2025 12:39:17 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, మే 18: యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా స్థిరపడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పిలుపునిచ్చారు. ఆదివారం శంకర్పల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మిస్టర్ ఛాయ్ డ్యూడ్ ప్రాంఛైస్ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

తమతో పాటు పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు . అనంతరం ప్రాంఛైస్ యజమానులు శేరి లతా లక్ష్మారెడ్డి, అరుణ సంజీవరెడ్డిలకు  శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  మున్సిపాలిటీ మాజీ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీపీలు ధర్మనోళ్ళ గోవర్ధన్ రెడ్డి, చిన్న నరసింహులు, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధర్మనోళ్ళ వెంకటరెడ్డి, శంకర్పల్లి మాజీ సర్పంచ్ భీసోళ్ళ శ్రీధర్,పట్టణ ప్రముఖులు కాసెట్టి మోహన్, కోడి లింగం, మొగులయ్య, రాము పంతులు, దోబీపెట్ చంద్రయ్య, శకుంతల తదితరులు పాల్గొన్నారు.