calender_icon.png 4 December, 2024 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి రక్షకులకు అన్నీ కష్టాలే!

07-11-2024 12:19:28 AM

  1. మూడు నెలలుగా అందని వేతనాలు  
  2. 10 నెలలుగా అందని మెస్ ఛార్జీలు
  3. బేస్ క్యాంపు వాచర్‌లకు తిప్పలు

నిర్మల్, నవంబర్ ౬ (విజయక్రాంతి): అడవిలో కాపలా కాస్తున్న బేస్ క్యాంపు వాచర్‌లకు ప్రతి నెలా అందాల్సిన వేతనాలు అందడంలేదు. మూడు నెలల నుంచి వేతనాలు రాకపోగా 10 నెలల మెస్ బిల్లులు కూడా ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడవుల రక్షణకు, కౄరమృగాల మధ్య ప్రాణాలకు తెగించి కాపలా ఉంటున్న వాచర్‌లపై అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 75 బేస్ క్యాంపులు ఉండగా 378 మంది విధులు నిర్వహిస్తున్నారు. రిజర్వుడు ఫారెస్టుతో పాటు చెక్‌పోస్టు లు, అడవి జం తువుల రక్షణ క్యాంపుల్లో విధు లు నిర్వహిస్తున్నారు.

అటవీ శాఖ ఆధ్వర్యం లో ఏజేన్సీల ద్వారా బేస్ కా్ంయ పు వాచర్‌లుగా విధులు నిర్వహిస్తున్నా కాంట్రాక్టు ఏజేన్సీలు ప్రభుత్వ టెండర్ల పక్రియ ద్వారా చేపడుతుంది. అయితే కొత్త ప్రభుత్వం ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించింది. వారు ప్రతి నెలా వాచర్‌గా విధులు నిర్వహిస్తున్న వారి కి రూ.10,300 వేతనం, మెస్ చార్జీల కింద రూ.3,380 చెల్లించాలి.

ఈపీఎస్, ఈఎస్‌ఐ ఇతర సదుపాయాలు కల్పించాలి. కానీ మూడు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. 10 నెలలుగా మెస్ బిల్లులు కూడా రాక పోవడంతో ఇంటి నుంచే భోజన తెచ్చుకుంటున్నారు. కాంట్రాక్టర్‌లను అడిగితే పట్టించు కోవ డంలేదని, పైగా విధలు నుంచి తొలగిస్తామని భయపెడుతున్నారని వాచర్లు చెబుతున్నారు. 

ప్రాణాలకు తెగించి విధుల నిర్వహణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బేస్ క్యాంపులతో పాటు చెక్ పోస్టులు, వన్య మృగాల సంరక్షణ కేంద్రాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ప్రాణాలకు తెగించి వాచర్లు విధులు నిర్వహిస్తున్నారు. దట్టమైన అడవిలో గూడారాలను వేసుకొని అటవీ సంపద రక్షణకు పాటుపడుతున్నారు. ఇద్దరు నుంచి ముగ్గురు ఒక క్యాంపులో విధులు నిర్వహిస్తారు.

రాత్రి సమయంలో అడవిలో గస్తీ తిరుగుతూ చెట్ల నరివేతను అడ్డుకుంటారు. నిర్మల్ జిల్లా కవ్వల్ టైగర్ జోన్‌తో పాటు కడెం దస్తురాబాదు, పెంబిరాజుర మామడ సారంగపూర్, కుబీర్ కుంటాల, ఖానాపూర్ గంగాపూర్ ప్రాంతాల్లో వీరు ఎక్కువగా పనిచేస్తు న్నారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిచ ఉట్నూర్, సిర్పూర్, తాండుర్, వేమన పట్టి దహెగాం, నార్నూర్, తలమడుగు, బెలా, బోథ్, నెరడిగోండ, ఇచ్చొడ, ఇంద్రవల్లి, జన్నారం, దంతనపల్లి వంటి అటవీ ప్రాంతాల్లోని బేస్ క్యాంపుల్లో విధులు నిర్వహిస్తున్నారు. 

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం

నేను పెంబి మండలంలోని రాజురా బేస్ కా్ంయపులో 5 సంవత్సరాల నుంచి వాచర్‌గా పనిచేస్తున్నా. తక్కువ జీతమే అయినప్పటికీ ప్రతి రోజు అడవిలో ఉంటూ అటవీ సంపదను కాపాడుతున్నాం. రాత్రి సమయంలో ఎక్కడ ఏ శబ్దం వచ్చినా టార్చి లైట్ సాయంతో అడవిలో తిరుగుతూ అటవీ సంపదను కాపాడుతున్నాం. అయిన మాకు వేతనాలు, మెస్ బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నాం.

నారా ప్రకాష్ స్వామి, రాజురా క్యాంపు

ప్రతి నెలా వేతనాలు ఇవ్వాలి

10 సంవత్సరాల నుంచి వాచర్‌గా పని చేస్తున్నా. ప్రతి నెల రూ.10,300 వేతనం ఇవ్వాల్సి ఉండగా మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. కాంట్రాక్టర్లను అడిగితే ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చిన తర్వాత ఇస్తామని చెబుతున్నారు. మెస్ బిల్లులు 10 నెలల నుంచి రావడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి.

 నాగవత్ ఉపేందర్,

ఉడుంపూర్ కా్ంయపు