9 July, 2026 | 2:14 AM

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతా నా ఇష్టం

09-07-2026 01:46 AM
  1. అస్తవ్యస్తంగా తరగతులు సమయపాలన పాటించని సిబ్బంది
  2. హైదరాబాదు నుండి రాకపోకలు

నల్లగొండ టౌన్, జూలై 8 : దశాబ్దాల చరిత్ర కలిగిన నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2400 మంది పేద విద్యార్థినులు, 100 మంది సిబ్బంది ఉన్నా కనీస సమయపాలన పాటించకుండా అంతా నా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కళాశా లలో అధిక మంది సిబ్బంది హైదరాబాదు నుండి రాకపోకలు కొనసాగిస్తుండడంతో బోధన కుంటుపడుతుంది. హెచ్‌ఆర్‌ఏ పొం దుతూ వంతుల వారుగా కళాశాలకు వచ్చి బోధన చేపట్టడం తో విద్యార్థులకు రెగ్యులర్గా క్లాసులు నడవడం లేదని చెబుతు న్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఈ కళాశాలకు విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.సమయపాలన గాలికి: ఉదయం 9.30కు కళాశాల ప్రారంభం కావాల్సి ఉండగా 8.00 గంటలకే వచ్చే వి ద్యార్థినులు గేట్లు తెరవక రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం 12.30 త ర్వాత తరగతులు జరగడం లేదని విద్యార్థు లు చెప్తున్నారు.బోధనా సిబ్బంది లో 15 మంది రెగ్యులర్ లెక్చర్లు హైదరాబాద్ నుం చి వచ్చి పోతూ HRA తీసుకుంటున్నారని, . బయోమెట్రిక్ వేసి తెచ్చుకున్న అన్న o తిని వెళ్లిపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 ఏళ్లుగా క్లాసులు తీసుకోకుండానే జీతం తీసుకుంటున్నారని, అతనికే అకాడమిక్ కోఆర్డినేటర్ గా ఉండటంతో రిజలట్స్ పడిపోయాయని చెబుతుం నారు.

పరీక్షల విభాగం అస్తవ్యస్తం: గత 4 ఏళ్లుగా ఒకే వ్యక్తి కంట్రోలర్ గా ఉండి ఫీజు, హాల్ టిక్కెట్ల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తున్నారని, గతంలో హాల్ టిక్కెట్లు బయట పడేసిన ఘటనలున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్, స్పోరట్స్ విభాగం సిబ్బంది లేక మూతపడి ఉన్నాయి. ఇవి విద్యలకు ఉపయోగం లేకుండా ఉన్నాయి.భద్రత ప్రశ్నార్థకం: మహిళా డిగ్రీ కళాశాలలో పురుషుల ప్రవేశంపై నియంత్రణ లేదు.

విజిటర్స్ రిజిస్టర్ లేకపోవడంతో ఎవరు వస్తున్నారో.. పోతున్నారో తెలియని పరిస్థితి.ప్రిన్సిపాల్ అన్ని విషయాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని,. 2027లో న్యాక్ బృందం విజిట్ ఉండగా పూర్వ విద్యార్థుల డేటా కూడా సేకరించలేదని, త్వరలో పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో నిర్లక్ష్యం పెరిగిందని,జీతాలు వస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు . ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరతున్నారు.