calender_icon.png 27 November, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

27-11-2025 12:48:29 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), నవంబర్ 26 (విజయక్రాంతి): పం చాయతీ ఎన్నికలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో 27వ తేదీ నుండి ప్రారంభం కానున్న మొదటి విడత నామినేషన్లు ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తనా నియమా వళి అమలు, రెండు, మూడు దశల్లో ఎన్నిక లు నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అం శాలపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొ త్తం 12 మండలాల్లో మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 మం డలాల పరిధిలో 248 గ్రామపంచాయతీలో 2,012 వార్డులు ఉన్నాయని తెలిపారు. మూడు దశల్లో నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు 77 క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. మొదటి దశలో గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 గ్రామ పంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

2 వ దశలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల పరిధిలోని 85 గ్రామ పంచాయతీలలోని 694 గ్రామ పంచాయతీలకు, 3వ దశలో మల్హర్ రావు, మహదేవపూర్, మహా ముత్తారాం, కాటారం మండలాలలోని 81 గ్రామ పంచాయతీలలోని 696 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11 వతేదీ, 2వ విడత 14వ తేదీన, 3వ విడత 17 వతేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మొత్తం 3,02,147 మంది ఓటర్లున్నారని, వారిలో పురుషులు 1,47,388 మంది, మహిళలు 1,54,744 మంది, ఇతరులు 15 మంది ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలు నిర్వహణకు 77 క్లస్టర్లుగా విభజించామని, 2,523 మంది పిఓలు, 3,059 మంది ఓపిఓలు, 92 మంది స్టేజి 1 రిటర్నింగ్ అధికారులు, 278 మంది స్టేజి 2 రిటర్నింగ్ అధికారులు, ఏఆర్వోలు 93 మంది, జోనల్ ఆఫీసర్స్ 42 మంది, ఎఫ్‌ఎస్టీ 40 విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 27వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, నామినేషన్లు స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.

2102 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 20 శాతం రిజర్వడ్ తో 2523 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని, మొదటి విడతలో ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు మూడు రోజులు పాటు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమా వళి పటిష్టంగా అమలు చేసేందుకు ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టి, ఎంసిసి టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారాలకు సంబంధించినటువంటి అన్నిటిని తొలగించి 24, 48, 72 గంటల నివేదిక రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీడీవోలు ధ్రువీకరణతో నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ప్రజలు పిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్ నందు 24 గంటలు పనిచేసేలా 9030 632608 సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డివిజన్ కు ఒకటి అలాగే 12 మండలాలలో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 70 రూట్లుగా విభజించి పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ మెటీరియల్ తరలింపు చేయనున్నట్లు తెలిపారు.

పోలింగ్ కేంద్రాలకు సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలుగా విభజించి పటిష్ట పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 312 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అలాగే 30 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి అదనపు పోలీస్ బలగాలతో పటిష్ట పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు అ మల్లో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల ని యమావళి పాటించాలని ఆయన తెలిపారు. ఏదేని ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్య లు తీసుకుంటామని తెలిపారు.

రాజకీయ పార్టీలు, ప్రజలు జిల్లా యంత్రంగం సలహాలు, సూచనలు పాటించాలని, ప్రచారాల కు అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఏదైనా ఉల్లంఘన జరిగి తే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూము 8712658178 నెంబర్ కు కాల్ చేయాలని అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు గురికాకుండా నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, డిపిఆర్‌ఓ శ్రీనివాస్, అడిషనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.