27-11-2025 12:35:24 AM
-జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు
-నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
-సర్టిఫికెట్ల జారీపై అభ్యర్థుల్లో టెన్షన్
నిర్మల్, నవంబర్ 26 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వచ్చేలా 11, 13, 17 తేదీల్లో ఎన్నికల తేదీ ప్రకటించడంతో జిల్లాలో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్లు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లాలో 18 మండలాల పరిధిలో 400 గ్రామపంచాయతీలు ఉన్నాయి మొత్తం ఓటర్లు 44,93,02 ఉండగా పురుషులు 2,13,805 స్త్రీలు 2,35,485 ఓటర్లు ఉన్నారు.
482 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 58 సమసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఈనెల 27 నుంచి మొదటి విడత 30 నుంచి రెండో విడత ఐదు నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 113 నామినేషన్ కేంద్రాల ఏర్పాటు చేశారు మొదటి విడత కింద ఖానాపూర్ ప్రాంతంలోని ఆరు మండలాలు 136 గ్రామపంచాయతీలు రెండో విడత కింద నిర్మల్ బైంసా పరిధిలో ఏడు మండలాలు 131, మూడో విడత కింద ముధోల్ ప్రాంతంలో 133 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి
ఏర్పాట్లు అన్నీ పూర్తి..
నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామపంచాయతీకి ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశారు మూడు విడుదల నిర్వహించి ఎన్నికలకు కావలసిన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు 270 మంది ఆరువోలు 43 మంది సెకండ్ ఆర్వోలు 175 మంది పోలింగ్ ఆఫీసర్లు 2,652 మంది ఇతర సిబ్బందిని నియమించారు వీరికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులు సర్పంచులకు వార్డ్ మెంబర్లకు ఖర్చుల వివరాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహి స్తున్నారు. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ డిపిఓ శ్రీనివాస్ తదితరులు ఎన్నికల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుండగా జిల్లా ఎస్పీ జానకి ఏఎస్పీలు రాజేష్ మీనా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రిజర్వేషన్ల ఖరారు కావడంతో ఆయా గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులు పోటీ పడనున్నారు.
సమయం తక్కువ.. పరేషాన్ ఎక్కువ..!
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. నిన్న మొన్న టి వరకు ఎన్నికలు జరుగుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేసిన అభ్యర్థులు ఒక్కసారిగా షెడ్యూల్ పెరగడంతో పోటీలో దిగదుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల గుర్తుకు సంబంధం లేకుండా ఈ ఎన్నిక లు జరుగుతున్నప్పటికీ రాజకీయ మద్ద తు ఉంటేనే తాము గెలుస్తామన్న ధీమా తో స్థానిక సీనియర్ నేతలను ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఎన్ని కల పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్ ప్రకారం వివిధ కుల ధ్రువీకరణ పత్రాలు తోడు సర్టిఫికెట్లు పాత బకాయిల పెం డింగ్ తదితర సర్టిఫికెట్లను క్లియరెన్స్ చేసుకోవాల్సి ఉండడంతో ధ్రువీకరణ పత్రాలతో ఇబ్బందులు ఏర్పడే అవకా శం ఉండడంతో ఆందోళనలు చెందుతున్నారు. నామినేషన్లకు గడువు దగ్గర పడ డంతో అవసరమైన ధృవపత్రాలు సకాలంలో అందకపోతే పోటీ నుంచి తప్పిం చే ప్రమాదం ఉండడంతో ఆందోళన చెందుతుండగా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు మాత్రం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు వేగవంతం
నిర్మల్, నవంబర్ 26 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పరిపాలన తీసుకున్న ఏర్పాట్లు, అనుసరించాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను ప్రశాం తం, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 దశలలో ఎన్నికలు జరు గుతున్నాయని తెలిపారు.
పోలింగ్ బూత్ల ఏర్పాటు, సిబ్బంది నియా మకం, భద్రతా చర్యలు, పోలింగ్ సామగ్రి పంపిణీ వంటి ప్రతీ అం శాన్ని మండల వారీగా సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిబం ధనలపై అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు అందించినట్లు వెల్లడించిన కలెక్టర్, ఎన్నికల సంబందిత ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశా మని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగిం చుకునేలా పోలీస్ శాఖతో సమన్వయం పెంచి తగిన భద్రతా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియ మావళి పాటించడంలో ఎలాంటి రాజీ ఉండదని, ఉల్లంఘనలు గమనించిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశం లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఎఎస్పీ అవినాష్ కుమార్, డిపిఓ శ్రీ నివాస్, డిపిఆర్‌ఓ విష్ణు వర్ధన్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.