calender_icon.png 2 August, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలి

30-07-2025 01:23:02 AM

* కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి

* మాజీ ఎన్బిసి మెంబర్ తల్లోజు ఆచారి

తలకొండపల్లి,జులై 29: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కు కార్యకర్తలు సర్వం సిద్ధంగా ఉండి విజయమే లక్ష్యంగా ముందు కెల్లాలని జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజి ఆచారి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తలకొండపల్లి మండలం వెంకట్రావ్ పేట చౌరస్తా లోని పద్మ గార్డెన్ ఫంక్షన్ హాలులో మంగళవారం బీజెపీ మండల పార్టీ అధ్యక్షుడు రవిగౌడ్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు . వయా గ్రామల లో పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ఇంటీంటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం పేదలు,బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.పార్టీలో ఎవ్వరికి అవకాశం వచ్చిన వారి గెలుపు కోసం అందరు కృషిచేయాలని చేప్పారు. సమావేశంలో బీజెపీ జిల్లా,తాలుకా,మండల స్తాయి నాయకులు,శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు,బూత్ అద్యక్షులు,కార్యకర్తలుపాల్గొన్నారు.