19-02-2026 02:50:11 AM
నానాక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): అందాల సుందరీమణులు చీరకట్టులో ముద్దులొలికారు. చేనేత సింగారాలతో వా రు సిగ్గులొలికారు. ఎవ్వాహ్ - వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్ ఈ నెల 21, ౨౨ తేదీల్లో నానాక్‌రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గల పైర్ వాటర్ నియో కిచెన్ బాంకెట్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం హ్యాండ్ లూమ్ కలెక్షన్ ధీమ్ ఫ్యాష న్ షో జరిగింది.ఇక్కడ జరిగిన కర్టైన్ రైజర్‌లో నిర్వాహకులు, సోషలైట్ ఆలేఖ్య రెడ్డి తన బృందంతో కలిసి ఎవ్వాహ్ - వీవర్స్ హ బ్‌ను ప్రకటిస్తూ, ప్రదర్శన పోస్టర్‌ను మోడ ల్స్‌తో కలిసి ఆవిష్కరించారు.
బనారసి, కంజీవరం, పోచంపల్లి వంటి కలెక్షన్స్ ను మోడల్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి మాట్లాడుతూనేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని తెలిపారు. మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ప్రతి నెలలో ఒకసారి ఉంటుందన్నారు. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రదర్శనలో చేనేత కారులు, చేతి పని బృందాలు బనారసి, కంజీవరం, గద్వా ల్, పోచంపల్లి, మంగళగిరి వంటి విభిన్న రకాల హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని వివరించారు.