3 July, 2026 | 9:35 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

పేద అగ్రవర్ణ విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వరం

26-05-2025 01:48 AM

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, మే 29, (విజయ క్రాంతి): అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వరం లాంటిదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.

నగరంలోని ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాణిక్బన్ స్కూల్లో నిర్వహించిన ప్రతిభా పురస్కారం 2025 సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హిందువులు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అగ్రవర్ణంలో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడేలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం.

చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన కొనియాడారు అగ్రవర్ణ కులాల పేద మధ్యతరగతి విద్యార్థులు రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా విద్యార్థులు తమ పయనం సాగించాలని విద్యార్థులను సూర్యనారా యణ కోరారు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం ఆరోగ్యం కోసం విద్యార్థులతో పాటు క్రీడలు యోగా కళా సాంస్కృతి కార్యక్రమాల్లో కూడా రాణించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

విద్యార్థులు విద్యకు సంబంధించినవి తప్ప ఇతర వాటికి సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని విద్యార్థులకు సూర్యనారాయణ సూచించారు పదవ తరగతి ఇంటర్మీ డియట్ ఎంసెట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ ధన్ పాల్ సూర్యనారాయణ యంగ్ ప్రసాద్ రవీందర్ భోజరాజు చిరంజీవి రాజు రవీందర్ తదితరులు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.