calender_icon.png 29 May, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడ చెత్త అక్కడే!

26-05-2025 01:47:06 AM

  1. డ్రైనేజీల్లో చెత్తాచెదారం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు 
  2. పడకేసిన పారిశుద్ధ్య పనులు

తరిగొప్పుల, (విజయ క్రాంతి): వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు కూడా వచ్చినట్టే. తరిగొప్పుల మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తోనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని అధికారులు పలుమార్లు చెబుతున్న గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది.

సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీల కు స్పెషల్ ఆఫీసర్ల ను కేటాయించారు. దీంతో పారిశుద్ధ్యం పై అధికారులకు పట్టింపు లేకుండా పోయిందనే ఆరోపణలు గ్రామాలలో వినిపిస్తున్నాయి.

డ్రైనేజీల్లో చెత్తాచెదారం

తరిగొప్పుల మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మోజార్టీ గ్రామాల్లోని డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామాల్లో రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో చెత్తతో డ్రైనేజీలు పూడికపోయాయి.

దీంతో వర్షపు నీరు, గ్రామాల్లో ప్రజలు ఇంటి అవసరాలకు వాడుకున్న నీరు డ్రైనేజీల్లో సాఫీగా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఈగలు దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామాల్లోని పరిశుభ్రత చర్యలు పై అధికారులు దృష్టిసారించకపోవడంతో పరిశుద్యం అస్తవ్యవస్తగా మారింది.

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు

సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే గ్రామాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని ఇటు జిల్లా అధి కారులు, వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో మురుగు నీరు గుంతల్లో నిల్వ ఉండకుండా రోడ్ల వెంట చెత్త చెదరం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్న... గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.