26-05-2025 01:48:27 AM
మహబూబాబాద్, మే 25 (విజయ క్రాంతి): వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా వక్ఫ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.