20 August, 2026 | 2:20 AM

ఉత్సాహంగా OEM టెక్నికల్ మీట్

08-12-2024 01:19 AM

హైదరాబాద్, డిసెంబర్ 7: కాంక్రీట్ నిర్మాణంలో సవాళ్లు మరియు అవకాశాలు అనే అంశంపై తమ టెక్నికల్ టీమ్‌తో ప్రముఖ రెడీమిక్స్ కాంక్రీట్ సొల్యూషన్స్ సంస్థ కాంక్రీట్ OEM.. శనివారం టెక్నికల్ మీట్  నగరంలోని హోటల్ దస్పల్లా ఫోరం హాల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ రవీంద్రగెట్టు పాల్గొన్నారు.

కాంక్రీట్ నిర్మాణంలో తాజా పద్ధతులు మరియు నావీన్యత లపై తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమ నిపుణు లు, అకడెమిక్ వ్యక్తులు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. టెక్నికల్ మీట్ విజయవంతమైందని కాంక్రీట్ OEM మేనేజింగ్ డైరెక్టర్ కె.ఠాగోర్ అన్నారు. మాకు విలువైన అవగాహనను పంచిన డాక్టర్ రవీంద్ర గెట్టు గారికి, మా విలువైన కస్టమర్లు, కన్సల్టెంట్లు, క్లయింట్లు మరియు కాంక్రీట్ OEM బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని ఆయన అన్నారు.