డీటీసీ సెంటర్‌లో పట్నం విచారణ
08-12-2024 01:17 AM
వికారాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో ఏడూ ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని శనివారం పోలీసులు చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్(డీటీసీ)కు తరలించారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంచారు. తాండూరు డీఎస్పీ సమక్షంలో నరేందర్‌రెడ్డిని విచారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో డీటీసీ సెంటర్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.




