బీసీల స్థితిగతులపై నివేదిక ఇస్తాం
డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు
కరీంనగర్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీల ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లు, దామాషాపై రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, ప్రజల నుంచి డెడికేటెడ్ కమిషన్ శనివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో వినతులు స్వీకరించారు.
అనంతరం కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు మీడియాతో మా ట్లాడుతూ.. ఇప్పటి వరకు తొమ్మిది ఉమ్మడి జిల్లా ల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించామన్నారు. బీసీల్లో అందరికీ సంక్షేమ ఫ లాలు అందేలా చూడాలని కొన్ని సంఘాల వారు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చే యాలని ఆయా సంఘాల ప్రతినిధులు కోరినట్లు వివరించారు. సమగ్ర సర్వే వివరాలు వచ్చాక ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చైర్మన్ తెలిపారు.
అంతకుముందు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద కమిషన్ చైర్మన్, సభ్యులకు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, నగరపాలక కమిషన్ చాహత్‌బాజ్‌పాయి, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్ స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్ వెంట సెక్రెటరీ సైదులు, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ ఉన్నారు.




