26-09-2025 09:15:50 AM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని ఎగ్లాస్ పూర్ లో ఏర్పాటు చేసిన మీసేవ సెంటర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మీసేవ సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీసేవ సెంటర్ కు వచ్చే ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి మీ సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు శశిభూషణ్ కాచే, ఐఎన్ టి యుసి జాతీయ నాయకులు పేరవేని లింగయ్య యాదవ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, నాయకులు మంథని సత్యం, ఆకుల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.