26-09-2025 09:13:39 AM
వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
మంథని, (విజయక్రాంతి): మంథని పట్టణంలోని రెడ్డి సేవ సంక్షేమ సంఘం అధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. రెడ్డి భవనంలో భారీ బతుకమ్మ ను ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో మహిళల కు బతుకమ్మ పండుగ ఎంతో ప్రాముఖ్యమైందని, ఈ పండుగను మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారని వారందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రెడ్డి సేవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కే.కే. రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎంఎస్. రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలుక సత్యనారాయణ రెడ్డి, సహాయక కార్యదర్శి ముసుకట్ల రమణారెడ్డి, మంథని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండు రమాదేవి, మాజీ జడ్పిటిసి సభ్యురాలు మూల సరోజనతో పాటు తదితరులు పాల్గొన్నారు.