calender_icon.png 26 September, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ అధికారుల దాష్టీకం

26-09-2025 08:48:21 AM

చేతికొచ్చిన పంట ధ్వంసం

ఆటవిశాఖ అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం.

 ఎమ్మెల్యే  పాయానికి మొరపెట్టుకున్న రైతు.

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): ప్రకృతి కన్నెర్ర ఒకవైపు  మరోపక్క యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే, చేతికి వచ్చిన పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి  వచ్చి సుమారు రెండు ఎకరాల పత్తి చేనును మొత్తం ధ్వంసం చేసి రైతుకు అపార నష్టాన్ని కలిగించారు. ఆళ్లపల్లి మండల పరిధిలోని రాయపాడు గ్రామ నివాసి నాగేశ్వరరావు  మాట్లాడుతూ... కోతుల కాపలా కోసం రోజువారీగా  ఉదయం చేను దగ్గరికి వెళ్ళగా పంట మొత్తం పీకేసి ఉన్నదని అది చూసి నా గుండె ఆగినంత పని అయిందని అతను వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు పెట్టారు. మాకు ఏ పంట చేను గత 20 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టా కూడా ఇచ్చిందన్నారు. అయినా కూడా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంతో మొక్కలు పీకేసారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి  మండలంలో పాయం పర్యటనలో పీకేసిన మొక్కలతో రోడ్డు మీద వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి  సమస్యను పరిష్కరిస్తానని పాయం హామీ ఇచ్చారు.