calender_icon.png 14 September, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్నించు మిత్రమా!

28-06-2025 12:00:00 AM

నాకు వండి పెట్టడానికి మా అమ్మ వూరినుంచి వచ్చింది. ఆమెకు జగన్ మంచితనాన్ని, అతని ఔదార్యం వల్లే రెండేళ్లు అక్కడ వారి హాస్టల్‌లో ఉండగలిగిన విషయాన్ని అమ్మకు చెప్పాల్సింది. చెప్పక పోవడం ఎంత తప్పో నాకు తర్వాత కానీ తెలియలేదు. జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగి పోతుంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ఫలితం నేను ఆ మిత్రునికి దూరం కావడం. 

యాభై ఏళ్లు దాటినా ఆ విలువైన నా క్లాస్‌మేట్, బాల్యమిత్రుణ్ణి మరిచి పోలేకున్నాను. కార ణం లేకపోలేదు. ఆ సందర్భాన్ని తెలుపడం కోసమే ఇప్పుడీ వ్యాసం. అతడూ నేను, కల్వకుర్తి తాలూకాకు చెందిన వారం. మా మైత్రి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ కాలేజీలో నేను చేరిన రోజే ప్రారంభమైంది. సాయంత్రం కళాశాల కాబట్టి, సాయంకాలం అడ్మిషన్ తీసుకుని క్లాసులోకి ప్ర వేశించాను.

వారం రోజులుగా క్లాసులు జరుగుతున్నా అదే నాకు మొదటి క్లాసు. చివరి క్లాసు తొమ్మిది గంటలకు ముగిసిం ది. ఉదయం ఊరునుంచి బయలుదేరి ప ట్నానికి రావడం వల్ల చాలా అలసిపోయా ను. కళ్లు మూతలు పడుతున్నాయి. మా అన్నతో నారాయణగూడకు వెళ్లి అక్కడ ఒకరి ఇంట్లో ఉండి చదువుకోవాలి. కానీ, అతని పుణ్యమా అని నా గతి మారింది.

“మిత్రమా! మీది ఏ వూరు?” తనకు తానుగా చొరవ తీసుకొని అడిగాడు. పేరు జగన్ మోహనాచారి. ఇప్పటికీ నా కళ్లలో మెదలుతున్నాడు. “కొల్కులపల్లి” నాది ముక్తసరి సమాధానం. జగన్ పొట్టిగా, ఎర్రగా ఉంటాడు. నీలం కళ్లు కదిలిస్తూ నాకేసి ఆప్యాయంగా చూస్తున్నాడు. అతణ్ణి నాకోసమే భగవంతుడు పంపాడేమో.

“బాగా అలసిపోయినట్లున్నారు. మాదీ మీ ఊరి దగ్గరే. నేనుండే హాస్టల్ ఈ కాలేజీకి సమీపంలోనే ఉంది..” అతని మాట ల్నిబట్టి నన్ను తన హాస్టల్‌కు రమ్మని పిలిచినట్లు నాకు అర్థమైంది. అతనిలో నాకు తెలియని ఆత్మీయుడు కనిపించాడు. “మీరిక్కడే ఉండవచ్చు కదా? ఒక్క తాలూకా వాళ్లం. రూమ్‌కు ముగ్గురేసి ఉండాలి. తలా ఒక రూపాయి అద్దె చెల్లిస్తే సరిపోతుంది..” 

నాకెంతో సంతోషమైంది. ఈ హాస్టల్ కాలేజీకి చాలా సమీపంలో ఉంది. ఇక్కడుంటే చదువుకోవడానికి మంచి అవకా శం లభిస్తుంది. నారాయణగూడలో గుర్తు న్న వారి గుడిసెలో ఉండి చదువుకోవాలి. ఎక్కడున్నా వంట చేసుకోక తప్పదు.

తలూపాను. హాస్టల్ గదిలో ఉండడానికి నాకు అవకాశం లభించినందుకు మా అన్న ఎంతో సంతోషించి, వూరికి వెళ్లిపో యా డు. జగన్మోహనాచారి విశ్వకర్మీయు డు. అందుకే, అతనికి విశ్వకర్మ హాస్టల్‌లో వసతి లభించింది. మరి, నేను పద్మశాలి. ‘నన్ను హాస్టల్ ఉండనిస్తారా?’ అదే అడిగాను జగన్‌ను.

ఎందుకైనా మంచిదని, నారాయణగూడలోని రాజ్‌మొహల్లాలో ఉన్న పద్మశాలి హాస్టల్‌కు వెళ్లాను. 600 రూపాయల విరా ళం ఇస్తూ, నెలకు 60 రూపాయలు కడితే భోజనంతో కూడిన వసతి లభిస్తుందని చె ప్పారు. అది నాలాంటి నిరుపేదకు అసాధ్యమనిపించింది. జగన్ హాస్టల్ వారిని ఎలాగోలా ఒప్పించాడు. దాంతో అక్కడ సుమారు రెండు సంవత్సరాలు ఉండగలిగాను. తర్వాత గౌలిపురాకు మకాం మా ర్చాను.

శాలిబండలో అద్దె లేకుండానే ఉం డడానికి రెండు గదుల వసతి లభ్యమైంది. వసతిని ఉచితంగా ఇచ్చిన వారి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాణ్ణి. అందుకుగాను వారు అదనంగా నెలకు 30 రూపాయలు ఇచ్చేవాళ్లు. జీవితం ఒడిదొడుకులు లేకుండా సాగింది. 1975లో చదువు పూర్తి కాగానే తెలుగు పండితునిగా ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగం దొరికినందుకు ఎక్కువగా సంతోషించిన వాళ్లలో ఒకడు జగన్మోహనాచారి.

నాకు వండి పెట్టడానికి మా అమ్మ వూరినుంచి వచ్చింది. ఆమెకు జగ న్ మంచితనాన్ని, అతని ఔదార్యం వల్లే రెండేళ్లు అక్కడ వారి హాస్టల్ ఉండగలిగిన విషయాన్ని అమ్మకు చెప్పాల్సింది. చెప్పక పోవడం ఎంత తప్పో నాకు తర్వాత కానీ తెలియలేదు.

జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగి పోతుం టాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ఫలి తం నేను ఆ మిత్రునికి దూరం కావడం. నాకు కొత్తగా ఉద్యోగం దొరికినందుకు ఆనందంతో జగన్ నా అడ్రస్ తెలుసుకొని, నన్ను కలవాలని శాలిబండలోని ఇంటికి వచ్చాడు. 

స్నేహం ఎంత బలీయమో కదా!

నేనప్పటికి స్కూల్ నుంచి రాలేదు. వ చ్చీ రాగానే నా కోసం అమ్మను అడిగాడు. కాని, అమ్మ “రాత్రి అవుతుంది రావడానికి..” అంది. “సరే, అమ్మా. నేను చెన్నప్ప వచ్చేదాకా ఇక్కడే ఉంటాను..” అంటూ బ్యాగు లోపల పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. అమ్మకు అర్థం కాలేదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదాయె. అతడు నాకు మంచి మిత్రుడని తెలిసి ఉంటే బావుంటేది.

ఎవరైతేనేం, వచ్చిన అతిథికి మంచినీళ్లు ఇద్దామన్న ఆలోచనా తనకు రాలేదు. అతడే పాపం, చొరవ తీసుకుని ‘నీళ్లు అడిగి’ తాగాడు. పోనీ, జగన్ అయినా తనను తాను పరిచ యం చేసుకుని, ఇద్దరం మంచి మిత్రులమని చెప్పాడా అంటే అదీ లేదు. 

“చెన్నప్పతో నేను ఇవ్వాళ ఇక్కడే భోంచేస్తానమ్మా. రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్లిపోతాను..” అన్నాడు జగన్ ఎంతో చొరవగా. అమ్మ అతనంత ఆప్యాయంగా తనతో మాట్లాడలేకపోయింది.

ఆ రోజు ఇంటికి రావడానికి నాకు బా గా ఆలస్యమైంది. జగన్ రాత్రి 8 గంటల దాకా చూశాట్ట. ఆ రోజుల్లో ఫోన్లు అందుబాటులో లేవాయె. చూసి చూసి,

“సరే, వెళ్తున్నానమ్మా. జగన్మోహన్ వ చ్చి వెళ్లాడని మాత్రం చెప్పండి..” అని తన బ్యాగు తీసుకుని వెళ్లిపోయాడు నిస్తేజంగా. అమ్మ వారించలేదు. రాత్రి ఉంటానన్న మనిషి ఎందుకు వెళ్లిపోయనట్లు? అమ్మ ను అపార్థం చేసుకున్నాడా! ఏమో!! ‘నేను వచ్చేవరకు ఉన్నా బావుండేది కదా’ అనిపించింది. చాలా బాధేసింది. అమ్మను ఏ మీ అనలేదు. అలాగని, వెళ్లిన మిత్రుణ్ణి అప్పటికప్పుడు కలుసుకోలేను. 

ఉదయం లేవగానే జగన్‌కు లెటర్ రాశాను “నన్ను క్షమించు మిత్రమా!” అంటూ. నాకు ప్రియమైన మిత్రుడు కను క, తాను వచ్చి వెళ్లిన విషయం ఒక్క అక్షరం పొల్లు పోకుండా సమాధానంగా మరో ఉత్తరంలో తెలియజేశాడు. ‘ఎంత పనైంది’ అనిపించింది. తర్వాత జగన్ మళ్లీ నాకు కనిపించలేదు. నేను పశ్చాత్తాపంతో కుమిలిపోయాను.

కాలం చాలా చిత్రమైంది కదా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా పదవీ విరమణ సందర్భంగా జరిగిన ఉత్సవంలో హఠాత్తుగా ఆనాటి బాల్యమిత్రుడు జగన్మోహనాచారి ప్రత్యక్షమయ్యాడు. సుమారు 40 ఏళ్ల తర్వాత కనిపించిన తనను వాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నాను.

క్షేమసమాచారం తెలుసుకున్నాను. ఆ తర్వాతినుంచీ తాను ప్రతిరోజూ వాట్సప్‌లో నాకు శుభోదయం పలుకుతాడు. నేనూ స్పందిస్తాను. ఒకరోజు తనతో అన్నాను “ఇప్పుడైనా .. మా ఇంటికి రావచ్చు కదా!” 

“తప్పక వస్తాను...” 

అన్నాడు కాని, ఇంతవరకు రాలేదు. ‘ఎప్పుడు వస్తాడా’ అని ఎదురు చూడటం తప్ప నేను మరేం చేయగలను!

వ్యాసకర్త సెల్: 9885654381