calender_icon.png 14 September, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సర్కారుబడి సూపర్‌హిట్!

28-06-2025 12:00:00 AM

తెలంగాణ సర్కార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నది. బడిబాట, ఇంగ్లిష్ విద్యాబోధన వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకూ ప్రభుత్వ బడుల్లో రెండున్నర లక్షల మంది కొత్తగా చేరారు. దీంట్లో సుమారు 50 వేల మంది వరకూ ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో చేరిన వారే కావడం రికార్డు. 

గతంలో సర్కారు బడి అంటే తల్లిదండ్రుల్లో ఒక రకమైన చులకన భావం, అనాసక్తి ఉండేది. పిల్లలకు విద్యాబోధన సరిగా అందదనే అభిప్రాయం ఉం డేది. వసతులు సరిగా ఉండవు. చదువు సరిగా రాదు. ‘సార్లు చదువు ఎట్ల చెబుతా రో ఏమో’ అనే అనుమానాలు అనేకం ఉండేవి. అధిక శాతం ప్రైవేటు స్కూళ్లకే ప్రా ధాన్యం ఇచ్చేవారు. పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు పాపం టీచర్లు విద్యార్థుల ఇల్లిల్లూ తిరిగేవారు.

ఎంత రమ్మన్నా ‘ససేమిరా’ అనే వారు. కానీ, ప్రస్తుతం తీరు మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటుకు దీటుకు కార్పొరెట్ స్థాయిలో ప్ర భుత్వ పాఠశాలలకు సకల హంగులు కల్పిస్తోంది. దీంతో సర్కారు బడులు బలోపేత మయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రభు త్వ బడుల్లో అడ్మిషన్లు ఈసారి పెరగడం విద్యారంగ చరిత్రలోనే విప్లవాత్మకం. 

తల్లిదండ్రుల్లో ఆలోచనా తీరుకూడా మారింది. ప్రైవేటుకు పంపి వేలకు వేలు ఖర్చు చేసుకోవడం ఎందుకనే మనసు మార్చుకుంటున్నారు. సర్కారు బడులకు పిల్లలకు పంపడం వల్ల ఈ ఏడాది విపరీతంగా అడ్మిషన్లు పెరిగాయి. కాంగ్రెస్ ప్ర భుత్వం విద్యారంగంలో వినూత్న మార్పు లు చేపట్టడంతో సర్కారు బడి సూపర్ హిట్ అయింది.

ప్రభుత్వం బడులు ప్రా రంభించే నాటికే విద్యార్థులకు డ్రెస్స్‌లు, పాఠ్యపుస్తకాలు అందజేయడంతోపాటు పాఠశాలల్లో మౌళిక వసతులు అన్నీ కల్పించింది. మరోపక్క కార్పొరెట్ స్థాయి లో డిజిటల్ విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయం, అత్యుత్తమంగా పా ఠాలు బోధించే ఉపాధ్యాయులు అందుబాటులోకి రావడంతో పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. 

విప్లవాత్మక మార్పులతో సత్ఫలితాలు

మెరుగైన సమాజం కోసం నేటితరం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. దాంతో తెలంగాణ సర్కార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నది. బడిబాట, ఇంగ్లిష్ విద్యాబోధన వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధ్యాయులు చేప ట్టిన ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం ద్వారా అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ విద్యా సంవత్స రం ఇప్పటి వరకూ ప్రభుత్వ బడుల్లో రెం డున్నర లక్షల మంది కొత్తగా చేరారు. దీం ట్లో సుమారు 50 వేల మంది వరకూ ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో చేరిన వారే కావడం రికార్డు. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుకోసం విద్యాశాఖ అధికారులు ఈనెల 6 నుంచి 19 వరకూ ప్రొఫె సర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేలా ప్రభుత్వం ప్ర త్యేక చర్యలు చేపట్టింది.

దీనికి టీచర్ల సం ఘాల ప్రతినిధుల పాత్ర కూడా ఉంది. ఈనెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,56,156 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. దీం ట్లో ఒకటో తరగతిలో 1,07,126 మంది చేరగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ 1,49,030 మంది ప్రవేశాలు పొం దారు. కొత్తగా గతేడాది రిక్రూట్ అయిన పదివేల మంది టీచర్ల పాత్ర కీలకంగా ఉం ది. అయితే, గతేడాది జూన్ 24 వరకూ కొత్త అడ్మిషన్లు 2,00,901 ఉండగా, ఈసారి 2.56 లక్షలకు పెరగడం విశేషం.

నిరుడితో పోలిస్తే ఏకంగా 55 వేలకు పైగా కొత్త అడ్మిషన్లు పెరిగాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫామ్ వర్క్ బుక్కులు అందించడం ఒకటైతే, అమ్మ ఆదర్మపాఠశాలల కమిటీల ఏర్పా టు మరొకటి. ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాల్లలో అభివృద్ధి పనులు, మౌళిక వసతులు కల్పించింది సర్కారు.

ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకూ 48,133 మం ది ప్రైవేటు స్కూళ్ల నుంచి గవర్నమెంట్ బడుల్లో చేరారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం కూడా సర్కారు పాఠశాలలవైపు ఆలోచించేలా చేస్తున్నది. ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థిపై రూ. లక్ష ఖర్చు చేస్తోంది. దీంతోపాటు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు.

కార్పొరెట్ చదువులకు దీటుగా!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నారు. ప్రభుత్వ బడుల బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్ప నకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థి జీవితంలో బడి అనేది తొలిమెట్టు.

బడి బాగుంటేనే విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తారనే ఆలోచనతో ప్రభు త్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ ఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్న భో జనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మహిళలకు వి ముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదే శించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో వి న్నూత కార్యక్రమాలు చేపట్టింది. కార్పొరెట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నది. ఏఐ ఆధారిత డిజిటల్ విద్య ను ప్రభుత్వ బడుల్లో అందిస్తున్నది. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పిస్తున్నది. ప్రభుత్వ సంస్కరణలతో సర్కార్ బడులకు ప్రవేశాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ హయాంలో విద్యారంగాన్ని సరిగా పట్టించుకోలేదు.

పాఠశాలల్లో సరైన మౌళిక సదుపాయాలు కల్పించలేదు. ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలను నిర్లక్ష్యం చేసింది బీఆర్‌ఎస్. పదేళ్ల నుంచి బీఆర్‌ఎస్ చేపట్టని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అదే వి ధంగా డీఎస్సీ నిర్వహించింది. దాదాపు 11 వేల మందికి ఉపాధ్యాయుల నియామక ప్రతాలు అందజేసింది.

కొత్తగా చేరిన ఉపాధ్యాయులే ప్రస్తుతం అడ్మిషన్ల పెంపులో ప్రముఖ పాత్ర పోషించడం విశేషం. దాదాపు ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను సర్కారు చేపట్టింది. దాదా పు 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. అదే విధంగా 40 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేసింది. ఇది కూడా అనేక ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. కాంగ్రెస్ సర్కారు సాహసోపేతంగా నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయు ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. 

రాష్ట్రంలో 29,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, దాదాపు 20 లక్షల మంది మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేలా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.  ప్రభుత్వం 2025 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

పిల్లలు ప్రాథమిక విద్యలో ప్రవేశించే ముందు ప్రాథమిక అభ్యాస అవసరాలను తీర్చడం ద్వారా, మొదటి తరగతికి తగినంతగా సి ద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రీప్రైమరీ స్కూళ్లు ఎంతో దోహదపడతాయి. తద్వారా ప్రీప్రైమరీ నుంచే ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడంతో పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి.

రాబోయే రోజుల్లోనూ సర్కా రు బడులు మరింత బలోపేతం కావాలని కోరుకుందాం. సీఎం లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. ఇందుకు విద్యాశాఖ అధికారు లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మద్ద తు అవసరం. అప్పుడే మెరుగైన సమాజం కోసం నేటి తరం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యనందించిన వారమవుతాం. 

వ్యాసకర్త సెల్: 9441884389