calender_icon.png 19 August, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి

06-10-2024 02:05:49 AM

ఆ దేశమంత్రి రోజేర్స్‌తో వీసీలో మంత్రి ఉత్తమ్ చర్చలు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి):  తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు త్వరలో బియ్యం ఎగుమతి చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆ శాఖ కార్యాలయం నుంచి ఫిలిప్పీన్స్ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి రోజేర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసేందుకు తమ వద్ద బియ్యం నిల్వలు ఉన్నట్లు చెప్పారు.

నాణ్యత పరమైన కారణాలతో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడం లేదన్న విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. తెలంగాణలో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరగడంతో పాటు నాణ్యత మెరుగుపడిన నేపథ్యంలో ఎగుమతులపై చర్చలు జరిపినట్లు తెలిపారు.