పీఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
17-05-2024 12:31 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్ దరఖాస్తుల గడు వు పొడిగించినట్లు కన్వీనర్ రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి అప రాధ రుసుము లేకుండా మే 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డీపీఎడ్ కోర్సుకు ఇంటర్ పూర్తయి న విద్యార్థులు, బీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ పూర్తయిన విద్యార్థులతోపాటు చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జూన్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో టీఎస్ పీఈసెట్ రాత పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.




