27 March, 2026 | 9:04 PM

అచ్చిన లచ్చయ్య మృతి బాధాకరం

27-03-2026 07:38 PM

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

మునుగోడు,(గట్టుప్పల),(విజయక్రాంతి): ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు అయిలయ్య తండ్రి అచ్చిన లచ్చయ్య(76) మృతి చాలాబాధాకరమని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన సిపిఎం పార్టీ కార్యకర్తగా ఆయన చురుకైన పాత్ర పోషించేవారని వారు కొనియాడారు.

ప్రజా సమస్యల పట్ల నిరంతరం కృషి చేసే వారని వారన్నారు. ఆయిలయ్య తండ్రి లచ్చయ్య మృతి చెందడం సిపిఎం పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఈ అంత్యక్రియలకు ఐలయ్య జిల్లా అధ్యక్షుడిగా చేసే సమయంలో ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సయ్యద్ హసీం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ,జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, సిపిఎం మండల నాయకులు బొట్టు శివకుమార్, పగిళ్ల శ్రీను, అచ్చిన శ్రీను, కర్నాటి వెంకటేశం, మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం, సర్పంచ్ సింగం వెంకటేశం, పగిళ్ల బిక్షం, బండ లింగయ్య తుకారం తదితరులు పాల్గొన్నారు.