27 March, 2026 | 10:15 PM

Breaking News

తల నరుక్కుంట కానీ మాట తప్పను..!   •   ఘనంగా పెద్దమల్లరెడ్డిలో శ్రీ సీతారాముల కళ్యాణం   •   కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు   •   బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం   •   శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ   •   సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం   •   ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక   •   గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం   •   శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్   •   అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం   •  

ప్రబీర్ విడుదలపై టీడబ్ల్యూజేఎఫ్ హర్షం

17-05-2024 12:30 AM

హైదరాబాద్, మే 16( విజయక్రాంతి): యూఏపీఏ కేసులో అక్ర మంగా అరెస్టు చేసిన న్యూస్ క్లిక్ వ్యస్థాపకులు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను సుప్రీంకోర్టు విడుదల చేయడం పట్ల టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్య హర్షం వ్యక్తంచేశారు. చైనాకు అనుకూలం గా పని చేస్తున్నారంటూ ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. అక్రమ కేసుల పేరుతో మీడియాను, జర్నలిస్టులను బెదిరించాలనుకోవడం కేంద్ర ప్రభు త్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శమన్నారు. రాసినా, ప్రసారం చేసిన కథనాల పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి కాని, అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం అవివేకం అన్నారు.