4 June, 2026 | 2:42 AM

విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు

04-06-2026 02:07 AM

కేసముద్రం, జూన్ 3 (విజయక్రాంతి): కేసముద్రం మండలంలోని  పలు విత్తన దు కాణాలను మహబూబాబాద్ ఏ డీ ఏ అజ్మీర శ్రీనివాస్ రావు, ఎం ఏ వో బి.వెంకన్నతో కలిసి పత్తి విత్తనాలకు సంబంధించి ఇన్వైసులు స్టాక్ రిజిస్టర్లు సోర్స్ సర్టిఫికెట్లు తనిఖీలు నిర్వహించారు. ప్రతి విత్తన డీలరు స్టాక్ రిజిస్టర్లు, ఇన్వైసులు, పీసీ లు సక్రమం గా నిర్వహించాలని, విత్తనాల విక్రయానికి సంబంధించి రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు.

డీలర్లు ఎవరైనా నియమ నిబంధనలను అతిక్రమించి నట్లయితే  విత్తన చట్టం 1966 ప్రకారం చర్య లు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన అదికృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.

విధిగా బిల్లులు తీసుకోవాలని, రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు వేసుకోకూడదని, అలా వేసినట్లయితే విత్తనం యొక్క  జన్యు స్వచ్ఛత లోపించడం, మొలక శాతము తక్కువగా రావడం జరిగి దిగుబడును తగ్గే అవకాశం ఉన్నందున రైతు సోదరులు 60 మిల్లీమీటర్ల వర్షపాతం రెండుసార్లు పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలని సూచించారు. లూజు పత్తి విత్తనాలను లేబుల్ లేకుండా అమ్మితే కొనుగోలు చేయరాదని, వెంటనే వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. గ్లైపోసిట్,  నిషేధిత బిజీ 3 పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేనందున రైతులు అటువంటి పత్తి విత్తనాలను కొనకూడదని, వేసి మోసపోకూడదని తెలియజేశారు.