ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు
04-06-2026 02:09 AM
మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫరీద్ ఆధ్వర్యంలో అనాథ చిన్నారులకు అన్నదానం, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న హరీష్ రావు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బొమ్మకంటి వెం కట్ గౌడ్, దుగ్గి రాంగోపాల్, ఎస్కే జావీద్, మోతుకురి యువరాజ్, మహమ్మద్ గాయాజ్, విజ్ఞేష్ తదితరులు పాల్గొన్నారు.






