12-11-2025 12:48:38 AM
సూర్యాపేట, నవంబర్ 11 (విజయక్రాంతి) : డిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన దృష్ట్యా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసు శాఖ భద్రత చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో విసృత తనిఖీలు నిర్వహించారు.
బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు, బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులకు లాడ్జ్ లలో వసతి ఇవ్వవద్దు అని సూచించారు.
హుజూర్ నగర్ ఓల్డ్‌బస్ స్టాండ్ లో ..
హుజూర్ నగర్, నవంబర్ 11: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాలను పోలీసులు తనిఖీలు చేపట్టారు. హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది,
స్పెషల్ పార్టీ పోలీసు, ఓల్ బస్టాండ్, కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్, ప్రయాణికుల లగేజ్తో పాటు పార్సిల్ కార్యాలయంలో సోదాలు చేశారు.ఈ సందర్భంగా సీఐ చరమందరాజు మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు అప్రమత్తమై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు అందించాలన్నారు. ఎస్త్స్ర అన్వర్, పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.