25 August, 2026 | 3:39 AM

కేజీబీవీ విద్యార్థినులకు కంటి పరీక్షలు

25-08-2026 01:10 AM

30 మంది విద్యార్థినులకు కంటి పరీక్షలు.. అవసరమైన చికిత్సకు సూచనలు

దోమకొండ, ఆగస్టు 24 (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమకొండ  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  డి వై. డి ఎం & హెచ్ ఓ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీబీపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి (కేజీబీవీ) చెందిన 30 మంది విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు.

రిఫ్రాక్టివ్ ఎర్రర్ (దృష్టి లోపం) సమస్యతో బాధపడుతున్న విద్యార్థినులు కంటి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స, కళ్లద్దాల వినియోగంపై విద్యార్థినులకు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో బీబీపేట, బిక్కనూర్ మండలాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మనోజ్, డాక్టర్ సాధన పాల్గొన్నారు. బీబీపేట ఏఎన్‌ఎం ఈ. సుజాత కేజీబీవీకి చెందిన 30 మంది విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకువచ్చారు. విద్యార్థినుల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.