25 August, 2026 | 1:47 AM

కేతకి సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే

25-08-2026 01:09 AM

జహీరాబాద్, ఆగస్టు 24 : జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నాడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ కేతకి  సంగమేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు.

ఆలయానికి రాగానే ఆలయ రాజ గోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణ అధికారి విభూతి శివ రుద్రయ్య ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి వి శివ రుద్రయ్య శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనతోపాటు సదాశివపేట గొల్ల కాపర్ల సహకార సంఘం మాజీ కార్య వర్గ సభ్యుడు పెద్ద గొల్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.