12 July, 2026 | 2:14 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

వరద తాకిడి ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలి

05-09-2025 12:06 AM

జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో వినయ్ కృష్ణారెడ్డి శీలన 

నిజామాబాద్ సెప్టెంబర్ 4: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇందల్వాయి  వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందల్వాయి,భీంగల్  ప్రధాన మార్గంలో నీ ధర్పల్లి మండలం పాటితండా వద్ద వరద ప్రవాహానికి దెబ్బతిన్న వంతెనను గురువారం వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ  ఇటీవల జిల్లాలో ఏకధాటిగా కురి సిన భారీవర్షాల తో సంభవించిన వరదల వల్ల తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. సిరికొండ మం డలం కొండూర్ శివారులో వరద తాకిడి వల్ల దాదాపు కిలోమీటర్ వరకు పెద్దఎత్తున దెబ్బతిన్న బీటీ రోడ్డును, కూలిన హైలెవెల్ బ్రిడ్జి, చెక్ డ్యాంలను కలెక్టర్ పరిశీలించారు. నీట మునిగిన పంటలు, కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, ఇసుక మేటలు వేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోయి,

బ్రిడ్జి కూలిపోవడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు కొనసాగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తక్షణమే చేపట్టాల్సిన పనుల జాబితాలో కొండూరు రోడ్డు మార్గాన్ని చేర్చి, వెంటనే సౌకర్యాల పునరుద్ధరణ చేయాలని కలెక్టర్ సూచించారు. 

తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే చేపట్టాల్సిన పనులను, శాశ్వత ప్రాతిపదికన జరిపించాల్సిన పనులను వేర్వేరుగా విభజించుకుని ప్రాధాన్యతా క్రమంలో వాటిని చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు.  స్థానిక రైతులు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ వరదనష్టంపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు.

విద్యుత్, రవాణా, మంచినీటి సరఫరా వంటి వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ శంకర్ నాయక్, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహశీల్దార్ రవీందర్ రావు, ఆర్‌అండ్‌బీ ఏఈ గంగాధర్ తదితరులు ఉన్నారు.