calender_icon.png 5 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనరా..?కబ్జాకోరా?

05-09-2025 12:04:51 AM

-రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన మున్సిపల్ బాస్

-రంగారెడ్డి జిల్లా పసుమాములలో కబ్జాల బాగోతం

-స్థానిక నేతల, అధికారుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

-గత ప్రభుత్వ తెచ్చిన జీవోలు 58, 59తో బడాబాబులకే లబ్ధి

-కలెక్టర్ స్పందించి చర్యలు తీసునికుల డిమాండ్

 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాములలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. మున్సిపల్‌కమిషనర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలకు పాల్పడుతున్నాడు. తోటి అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ వ్యవహారాలను కొడుకు చేత కానిచ్చేస్తున్నాడు. తనదైనశైలిలో ప్రభుత్వ భూములను కొల్లగొడు తున్నాడు. పేదల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవోనం.59ను అడ్డం పెట్టు కొని తన కొడుకును ముందు వేస్తూ తండ్రి ఆడిన నాటకాన్ని ఆడించేస్తు న్నాడు. భూకబ్జాల బాగోతంపై ప్రత్యేక కథనం..

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో ఉన్న ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశాడు. 1000 గజాల మేర విలువ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారు. దీని విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. తండ్రి అండగా.. కొడుకు కబ్జానే కథనం రంగారెడ్డి జిల్లా మున్సిపల్, రెవెన్యూ అధికారుల్లో  చర్చనీయాంశంగా మారింది.

అబ్దుల్లాపూర్‌మెట్ మండల హైదరాబాద్‌నగర శివారు ప్రాంతం, అలాగే హైదరాబాద్‌విజయవాడ జాతీయ రహదారి కావడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమార్కులు ఎక్కడపడితే భూ కబ్జాలకు తెగపడుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో అన్నీ భూ వివాదాలే. స్థానిక నాయకులు ప్రోద్బలం, అధికారుల అండతో కోట్ల రూపాయాలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాకోరులకు ధారదత్తం చేస్తుండ్రు.

ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. కంచె చేను మీసే విధంగా తయారైంది అధికారులు తీరు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 58,59 జీవో పేదలకు ఉపయోగపడలేదు. ఈ జీవో వలన బడాబాబులకే లబ్ది చేకూరింది. ప్రభుత్వ భూములను, పార్క్ స్థలాలను, చెరువులు, కుంటలను రక్షించాడానికి గొప్ప లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా కమిషన్‌ఏర్పాటుచేశారు. కాంగ్రెస్‌నాయకులే చెరువులను, ఎఫ్‌టీఎల్‌ఏరియాల్లో కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.

రూ.5 కోట్ల విలువైన భూమి కబ్జా 

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్386లో ప్రభుత్వం ఉంది. పెద్దఅంబర్‌పేట్‌నుంచి పసుమాముల వెళ్లే జెడ్పీ రోడ్డుకు అనుకుని ఉంటుంది. 1000 గజాల మేరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో కమర్షియల్‌షెటర్లు నిర్మించారు. ఈ భూమి విలువ రూ.5కోట్లు. ఈ కబ్జా వెనక మణికొండ మున్సిపల్ కమిషనర్ డీఎస్ ప్రదీప్‌కుమార్‌హస్తం ఉంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ఇలా అక్రమలకు పాల్పడుతే ఎలా? 58,59 జీవో కింది కమిషనర్ కొడుకు పేర 131 గజాలు క్రమబద్దీకరణ అయినట్లు రికార్డులున్నాయి. 58, 59 జీవో ద్వారా ఓ మున్సిపల్ కమిషనర్‌కొడుకు ఏ ప్రతిపాదిక క్రమబద్దీకరించారు?

బడాబాబులకే 58, 59జీవోలు.. 

ప్రభుత్వ భూమిలో ఏండ్లకు ఏండ్లు కబ్జాలో ఉన్నవారి కోసం గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 58, 59 జీవోల ద్వారా ఆ భూములను క్రమబద్దీకరించుకోవడానికి బీఆర్‌ఎస్ సర్కార్ జీవోలు తీసుకొచ్చింది. కానీ ఈ జీవోల మాటున  అక్రమార్కులే లబ్ధి పొందుతున్నారు. 58,59 జీవోల ఎక్కడ కబ్జాల లేని వారికి కూడా ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారు అప్పటి రెవెన్యూ అధికారులు. ఈ జీవోల ద్వారా ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉండి క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు పెట్టుకున్నా.. పేదవారికీ మాత్రం రెగ్యులర్‌చేయలేదు కానీ బడాబాబులకు మాత్రం చక చక ఫైలు కదిలి  వారి పేరిట స్థలాలు క్రమబద్ధీకరణ అయ్యాయి. 58, 59 జీవోల ద్వారా ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించారు.

స్పందించని మణికొండ కమిషనర్.. 

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణల పై వివరణ కోసం మణికొండ మున్సిపల్ కమిషనర్ డీఎస్ ప్రదీప్‌కుమార్‌ను ను ఫోన్ లో  సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

అధికారుల అండతోనే కబ్జా 

పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్386లో ప్రభుత్వం ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కబ్జాపై వరసగా కథనాలు వస్తున్నా స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికారుల అండతోనే భూ కబ్జాలు. అక్రమ నిర్మాణా లపై వెంటనే చర్యలు తీసుకొని రెవె న్యూ అధికారులు పెన్సింగ్ ఏర్పాటు చేయాలి. లేని ఏడల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలకు పిలు పునిస్తాం.

- ఏర్పుల నర్సింహ, సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం